తన వాయిస్ ను పోలిన ఫేక్ వాయిస్ తో ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతీసేలా కుట్ర పన్నారని, ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్టు ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజిక వర్గానికి నిజాలు తెలియాలని ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నట్టు కౌశిక్ అన్నారు. కులాలతో సంబంధం లేకుండా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు. తన తల్లిదండ్రులు తనకు సంస్కారం నేర్పారని, హుజురాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను ఓర్వలేక ఈ కుట్రలని ఆయన ఆరోపించారు. నేను మాట్లాడినట్లు నా వాయిస్ తో ఒక ఫెక్ ఆడియోను సోసిల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ముదిరాజ్ కులస్తులకు నన్ను దూరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ఆ ఆడియో రికార్డ్ ను ఫోరెన్సిక్ కు పంపాలని డీజీపీని కోరినట్టు, తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన హెచ్చరించారు.