Friday, September 20, 2024
HomeతెలంగాణKCR fire on Modi: కేసీఆర్ నీ ప్రభుత్వం కూలగొడతా అంటారా?

KCR fire on Modi: కేసీఆర్ నీ ప్రభుత్వం కూలగొడతా అంటారా?

కేంద్రంలో ఉన్నది అసమర్థ సర్కారని, మోడీ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. జీఎస్టీ వల్ల 3 లక్షల కోట్లు నష్టపోయామన్నారు. ప్రధాని అద్భుతమన ప్రచారాలు మాత్రమే చేసుకుంటారని.. మనమంతా ఆలోచించకపోతే ఆగమై పోతామని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం ఆ తరువాత స్థానిక ఎంవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

- Advertisement -

కేంద్రం ఎందుకు సహకరించదు?

ఏపనికీ కేంద్రం సహకరించడం లేదని ఏమడిగినా హరా అనదు శివా అనదు అంటూ కేసీఆర్ మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి ..”పాలమూరు హమ్ బనాయేంగే అంటే హమ్ బనాయింగే అని చెప్పిర్రు.. కిదర్ గయా బయి , క్యూ నయీ బనాయా … పైన పటారం లోన లొటారం చెప్పేది డంబాచారం. అద్భుతమైన ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి , కేంద్ర ప్రభుత్వానికి ఏనిమిది సంవత్సారాల టైం చాలదా..? ఎనిమిదేండ్లా..? ఎక్కడ ఉంది ఈ దేశం.. నా వాటా చెప్పడానికే ఎనిమిదేండ్లు అయితే పర్మిషన్లు ఎప్పడు రావాలి , ప్రాజెక్ట్ ఎప్పడు కట్టాలి, నీళ్ళు ఎప్పుడు రావాలి.. మా మనుమండ్లా… మా ముని మనుమండ్లా లేకపోతే రానే రావా.. ఇట్లనే ఉండాలా భారతదేశం ఉండాల్నా.. మారాల్నా..?’’ అంటూ ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు.

బాగుపడితే అడ్డు పడతారా?
ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడుతరా దేశ ప్రధాని చేయవలిసిన పనేనా ఇది అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. “కేంద్ర ప్రభుత్వం చేయవలిసిన పనేనా పనికిమాలిన అడ్డం కాలు పెట్టి మేం పని చేయ్యం , మిమ్మల్ని చేయనియం దబ్బునా ఎవరైనా మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడుతాం ఇదా.. ఇదేనా పద్దతి ప్రధాన మంత్రి స్వయంగా కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కూలగొడుతా .. అంటే ఎమన్నట్టు, ఏం అర్ధం చేసుకోవాలి, నువు ఎట్లా గెలిచనవో మేము అట్లా గెలువలేదా.. మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినామా .. ఏం కారణం చేత కూలగొడుతం , బెంగాళ్ కు పోయి మమతా బెనర్జి నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నరు అని ప్రధాన మంత్రి చెప్పొచ్చునా.. ఇదేనా దేశం ఈ దేశమేనా మనం కోరుకున్నది దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడివాళ్ళు అక్కడా ఆలోచించకపోతే మనం చాలా దెబ్బ తింటాం ఆగమైపోతాం” అని ఆయన హెచ్చరించారు. జాతీయ రాజకీయాలను కూడ ప్రభావితం చేసి, అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డనుంచే పునాదులు వేసి మన పేరు బంగారు అక్షరాలతో రాద్దామంటూ కేసీఆర్ ఈసందర్భంగా పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News