Saturday, November 23, 2024
HomeతెలంగాణKhammam: బీఆర్ఎస్ కు బిగ్ షాక్

Khammam: బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కాంగ్రెస్ లోకి 100 కుటుంబాలు

ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏకంగా 100 కుటుంబాలు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. బైపాస్ రోడ్ లోని తుమ్మల క్యాంప్ ఆఫీస్ నందు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ గాజుల నీలిమ, గాజుల రమేష్, చింతగుర్తి గ్రామ ఎంపీటీసీ మాలోత్ లక్ష్మి, మళ్ళొత్. వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు, భూక్య వెంకన్న, వార్డు నెంబర్ బాదావత్ కృష్ణ, మాలోత్ హుస్సేన్, భూక్య వెంగళరావు, భూక్య మంత్యా, మాలోత్ నరేష్, సురభి రమేష్, షేక్ మహమ్మద్ అలీతో పాటు, రెండు గ్రామాలకు చెందిన 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీని వీడారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ..
కనీస మౌలిక సదుపాయాలు లేని రఘునాథపాలెం మండలంలోని గ్రామాలలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి రోడ్లు, తాగునీరు డ్రైనేజీ వ్యవస్థని శంకుస్థాపన చేసి నిర్మింప జేసిన ఘనత మాదేనని అన్నారు. నెల రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని అన్నారు. 20 రోజులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై అందరూ పనిచేసి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, పట్టణ అధ్యక్షులు జావిద్, సాదు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, యన్నేని రామారావు, తమ్మినేని నాగేశ్వరరావుతో పాటు రఘునాథపాలెం మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News