Saturday, July 6, 2024
HomeతెలంగాణKondagattu: సీఎం చేతుల మీదుగా..తీరిన మొక్కు

Kondagattu: సీఎం చేతుల మీదుగా..తీరిన మొక్కు

కొండగట్టు అంజన్నకు తాను ఎన్నో ఏండ్ల నుంచి తీర్చుకోవాలనుకున్న మొక్కు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తీరిందని ఎఫ్ డీ సీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు సారు క్షేమంగా వుండాలని మొక్కుకుంటూ లండన్ లో వున్న తాను ఇష్టదైవమైన కొండగట్టు అంజన్నకు 50 ఫౌండ్లను ముడుపు కట్టినట్టు అనిల్ వెల్లడించారు. ఆ మొక్కును సీఎం కేసీఆర్ తో వచ్చి తీర్చుకుందామని ఇన్నేండ్లు ఎదురు చూసి.. ఎట్టకేలకు తీర్చుకున్నట్టు ఆయన తెలిపారు. “అంజన్న హుండీలో నాతోనే ముడుపును కేసీఆర్ వేయించడం నా జీవితంలో మరిచిపోలేను..’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు అనిల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News