తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కెసిఆర్ ను తెలంగాణ సచివాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసారు. రామగుండం మెడికల్ కళాశాలకు సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా నామకరణం, సింగరేణి కార్మికులకు 50 బెడ్స్ తో ప్రత్యేక వార్ధు ఎర్పాటు సింగరేణి కార్మిక పిల్లలకు వైద్య కళాశాలో 5 శాతం కోటాను కేటాయిపు పై సిఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న కర్సి కమ్మి భూములు సుమారు 1018 ఎకరాలు పెద్దంపేట రాయదండి ఇతర గ్రామాల రైతులకు పట్టాలు ఇవ్వాలని సిఎం ను ఎమ్మెల్యే కోరగా సిఎం కే.సి.ఆర్ రెవెన్యూ సెక్రెటరీ నవీన్ మిట్టల్ కు పట్టాలు ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.