రామగుండం నియోజకవర్గ దశాబ్దాల కల సాకరం చేసి రామగుండం ఆరోగ్య దాతగా సిఎం కేసీఆర్ నిలిచారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం మెడికల్ కాలేజీలో కార్మికుల పిల్లలకు మెడికల్ సీట్ల కేటాయింపు పై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సాధించుకున్న మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులు, ఉన్న ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని తాను అసెంబ్లీలో కోరడం జరిగిందన్నారు. తన అభ్యర్థన మేరకు రామగుండం మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు ఏడు సీట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాంత సింగరేణి కార్మికులు, ఉద్యోగులు హర్షిస్తూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ కవిత సరోజిని, నాయకులు దామెాదర్, శ్రీనివాస్ రావు, శేషగిరి, జే.వి రాజు, మెతుకు దేవరాజ్, వడ్డెపల్లి శంకర్, తోకల రమేష్, బెంద్రం రాజిరెడ్డి, మండ రమేశ్, అనుముల కళావతి, చల్ల రవీందర్ రెడ్డి, గుంపుల ఓదేలు, ఇరుగురాళ్ల శ్రావన్, దొమ్మేటి వాసు, తదితరులు పాల్గొన్నారు.