బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులంతటా అవినీతి పెరిగిపోయిందని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ ఆరోపించారు. సనత్ నగర్ డివిజన్ లోని జెక్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఇంటింటికీ వెళ్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీలు, కేసిఆర్ ప్రభుత్వ వైఫల్యాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ తమను గెలిపిస్తే సనత్ నగర్ లో అవినీతి రహిత పాలన అందిస్తామని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతానని వివరించారు. కేసిఆర్ ప్రభుత్వ అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తేట తెల్లం అయిందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం, పాత్రికేయ వృత్తిలో ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఓటు అభర్తిస్తున్న విషయాన్ని చెప్పారు. ప్రజలు కచ్చితంగా తమ ఇంటి బిడ్డగా అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మల్లు ప్రసాద్, భాస్కరం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Kota Nilima: గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తాం
అభివృద్ధి పనుల్లో ఎనలేని అవినీతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


