KTR| బీఆర్ఎస్(BRS) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ వేడుకలుఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగరేసి కేసీఆర్(KCR) చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. కరీంనగర్ దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమందిని బలితీసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ ప్రజలను హింసిస్తోందంటూ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మళ్లీ ఒకసారి సంకల్పం తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇక సిద్ధిపేట దీక్షా దివస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్‌ను అంతం చేయాలన్న కాంగ్రెస్ పాచికలు పారలేదన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను టచ్ చేయలేరని ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ ఆనవాళ్లు రాష్ట్రంలో లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయ్యారు.