ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ నమోదుచేసిన కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టాలని కోరారు. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
కాగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు.