Sunday, November 16, 2025
HomeతెలంగాణKTR: పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్

KTR: పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్

KTR| వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి కుటుంబసభ్యులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. చట్టపరంగా న్యాయపోరాటం చేద్దామని.. పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ డీకే అరుణ లచగర్ల గ్రామానికి వెళ్తుంటే ఆమెను కూడా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. కానీ వార్డు మెంబర్ కూడా కానీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని మాత్రం లగచర్లకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతామని హెచ్చరించారు. కొడంగల్‌లో ఫార్మా విలేజ్‌ను ముందు నుంచే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈరోజు కొడంగల్ ఇలా రగలుతుండటానికి రేవంత్ రెడ్డి ఆనాలోచిత నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఈ ప్రభుత్వం తీరు ఉందని దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఆయనేమైనా బందిపోటా? అని నిలదీశారు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad