Saturday, July 27, 2024
HomeతెలంగాణKTR on Revanth: ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి...

KTR on Revanth: ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టాలి

మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైంది

కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడన్నారు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదని ఆయన భగ్గుమన్నారు.

- Advertisement -

గతంలో మేము ప్రజల అవసరాలు ఎట్ల తీర్చాలని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చేరికల పైన దృష్టి పెట్టిందని, ఢిల్లీకి డబ్బు సంచులు పంపడం పైన దృష్టి పెట్టారని బీఆర్ఎస్ ఆరోపణలు సంధించింది. గత పది సంవత్సరాలలో మా ప్రభుత్వం తండాల నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా ఏరోజు కూడా తాగునీటి ఇబ్బందులు రానియ్యలేదని, మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశామన్నారు. 50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశామని, కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.

కెసీఆర్ ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాదులో ట్యాంకర్ల హడావిడి మొదలైందని, రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయిందని, మూడు నాలుగు రెట్లు పెట్టి ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇది ప్రకృతి కొరత వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వచ్చిన కొరత అని ఆయన ఆరోపించారు.

గతంలో కురిసిన వర్షం కంటే 14% అధికంగా వర్షం ఉన్న తాగునీటి కొరత ఎందుకు వచ్చిందని, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి.. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండంటూ కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కాదు. వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టమన్నారు.

సాగర్ లో, ఎల్లంపల్లిలో, హిమాయత్ సాగర్ లో, ఉస్మాన్ సాగర్ లో నీళ్లు ఉన్నా… ప్రజలు ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాలని, తాగునీటి ఇబ్బందులు ఎందుకు పడాలి ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.

సంవత్సరం పాటు నగర జనాభా అవసరాలకు అవసరమైన నీళ్లు నాగార్జునసాగర్ లో ఉన్నా…
హైదరాబాద్ నగరంలో ఇంత తీవ్ర నీటి కొరత ఎందుకు ఉన్నదని నిలదీశారు. రాష్ట్ర ప్రజల తాగునీరు తీసుకోవాలి అంటే ఢిల్లీ ముందు బిక్షం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు కేటీఆర్. మా ప్రభుత్వం డిజైన్ చేసిన సుంకి శాల ప్రాజెక్టు 75% పూర్తయింది… కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టడంతో అది పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ మీద రాజకీయ కక్షతోని కాళేశ్వరంని విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ప్రయత్నం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్ లు ఎట్లా ప్రారంభమైనయ్ ? నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు ఆ నీళ్లు ఎక్కడ పోయ్ నయ్ … ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టినమని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నీటిని ఎందుకు దాచిపెట్టిందో చెప్పాలి.

కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా దాచి పెట్టడం వల్లనే లక్షల ఎకరాల పంట ఎండిందని, ఈ మూడు నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసి పంపులు ఆన్ చేసి ఉంటే ఒక్క ఎకరం పంట కూడా ఎండకపోయేదన్నారు. నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలన్న దుర్మార్గపూరిత ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని, పంట పండితే బోనస్ ఇవ్వాలా అన్న భయంతోనే పంటలను ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ఆరోపించారు.

హైదరాబాద్ నగరం కాంగ్రెస్ కి ఓటు వేయలేదు…కాబట్టి రేవంత్ రెడ్డి నగరం పైన కక్ష కట్టారని, అందుకే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్న తాగునీరు అందియడం లేదన్నారు. 12 గంటల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న ముఖ్యమంత్రి…అసలు ట్యాంకర్లతోని నీరు ఎందుకు సరఫరా చేయాల్సి వస్తుందో అది ప్రభుత్వ వైఫల్యం కాదా అనే విషయాన్ని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కన్నా రెట్టింపు ట్యాంకర్లు నగరంలో నడుస్తున్నాయని, ఈరోజు దాదాపు రెండు లక్షల 30 వేల ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారన్నారు. వీటి ద్వారా ప్రజలపై పడుతున్న భారం కాంగ్రెస్ పార్టీ వేసిందే కదా, రేవంత్ రెడ్డి ఈ భారం భరిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా చెప్పాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News