తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జరిగిన విద్యా దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో 8.5 కోట్లతో అభివృద్ధి చేసిన విద్యా క్యాంపస్ ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ 6 రోజుల క్రింద ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాల స్వామి ఆలయం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశాం అని, సంవత్సరన్నరలోనే అది పూర్తి చేస్తాం అన్నారు. విద్య తోనే వికాసం, అభివృద్ధి అని, తరగతులు భారత దేశ భవిష్యత్తుకు విజ్ఞాన ఖనులు అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రసిద్ధి సంస్థలలో పని చేస్తున్నారన్నారు.
అమెరికాలో ఎక్కడ పోయిన తెలుగు, తెలంగాణ ప్రజలు కోకొల్లలుగా వస్తారని, వారిని చూస్తే సంతోషంగా అనిపిస్తుందన్నారు. ఉపాధ్యాయుల కృషి వల్లే నేడు ఈ ఫలితాలు సాధ్యమాయ్యాయని, అమెరికాలో కూడా పేదలు ఉన్నారని, ఉన్నంతలో ఎంత చేశామో ఆలోచించండన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మానవ సంబంధాలు, జీవ కారుణ్యంపై పాటలలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో మండలాలు, ప్రజా ప్రతినిధులు పోటీ పడాలని, రాజన్న సిరిసిల్ల జిల్లాను విద్యా ప్రమాణాలలో దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.