కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి(Bhu Bharati) బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“భూ హారతి.. రైతు నెత్తిన సర్వే పిడుగు. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరిగా మారింది. సర్వేయర్ కొలిచి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తారు. ఆ బాధ్యతంతా రైతుదే కొత్త చట్టంలో నిబంధన మండలాల్లో సగటున రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్లు. తాజా నిబంధనతో రోజుకు 2 రిజిస్ట్రేషన్లూ గగనమే. రాష్ట్రంలో 250 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. సర్వేయర్లు కొరత తీవ్రంగా ఉండగా, వారి డిమాండ్ కారణంగా పైరవీలు, అవినీతికి ఆస్కారం ఉంది.
అదనపు చార్జీ చెల్లించినా.. చేయి తడపక తప్పని స్థితి తలెత్తనుంది. సర్వేతో నష్టాలు, కష్టాలు తప్పవు. సర్వే కోసం రైతు అదనంగా ఫీజు చెల్లించాలి. సర్వే చేయాలని అధికారులను బతిమాలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొలతలు, మ్యాప్ వచ్చే వరకు రిజిస్ట్రేషన్ జరగదు. సర్వే తర్వాత ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ రైతుకు అత్యవసరమైతే డిమాండ్ మేర చెల్లించాలి” అని కేటీఆర్ ఆరోపించారు.