కంచ గచ్చిబౌలి భూముల(HCU Lands) వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపామని.. హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన కానీ ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని మండిపడ్డారు.
హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాలు కొన్నాలకునే వారికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఆ 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్‌గా ప్రకటించి హైదరాబాద్‌లోనే బెస్ట్ ఎకో పార్క్ తయారుచేసి యూనివర్సిటీకి కానుగా ఇస్తామన్నారు. ఈ భూముల విషయం ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం తప్పదన్నారు. ఇది హైదరాబాద్ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటం అని కేటీఆర్ వెల్లడించారు.