Thursday, April 10, 2025
HomeతెలంగాణKukatpally: రంగధాముని చెరువు సుందరీకరణలో ఎమ్మెల్యే

Kukatpally: రంగధాముని చెరువు సుందరీకరణలో ఎమ్మెల్యే

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఐడీఎల్ చెరువు ( రంగదామని చెరువు) సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ చెరువు సుందరీ కరణ పనులు త్వరగా పూర్తిచేయాలని అలాగే వినాయక నిమజ్జనం ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా సరైన స్థలం వదిలి సుందరీకరణ పనులు చేయాలని వారికి సూచనలు చేశారు. మరో రెండు నెలల్లో చెరువు సుందరీకరణ పూర్తవుతుందని ఆయన తెలిపారు. కూకట్పల్లికి రంగదాముని చెరువు మినీ ట్యాంక్ బండ్ గా.. అలాగే ఒక పర్యాటక ప్రదేశంగా మారబోతుందని ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు మాధవరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News