Friday, November 22, 2024
HomeతెలంగాణMahabubabad: పెండింగ్ బిల్లు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం

Mahabubabad: పెండింగ్ బిల్లు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం

కాంట్రాక్టర్ల..

మున్సిపాలిటీ పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు గత సంవత్సరం ఆరు నెలల నుండి బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో మహబూబాబాద్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ బాధ్యులు మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ కు కాంట్రాక్టర్లకు బకాయి పడిన బిల్లులు వెంటనే చెల్లించాలని వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోయినపల్లి లక్ష్మణరావు , కోశాధికారి మార్నేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆరు నెలల నుండి మున్సిపాలిటీలో పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని వెంటనే సదరు బిల్లులను చెల్లించాలని అయన అన్నారు. మహబూబాద్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి, 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఎస్ డి ఎఫ్ TFIDC జనరల్ ఫండ్ గ్రాండ్స్ ద్వారా పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగెల తిరుగుతున్నారని అన్నారు.

కాంట్రాక్టర్లు పీకల్లోతు అప్పుల్లో ఉన్నట్టు, వడ్డీలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టర్లకు బకాయి పడ్డ బిల్లులు 15 రోజులలో చెల్లించాలని అన్నారు. లేనట్లయితే మహబూబాబాద్ మున్సిపాలిటీలో నిరవధికంగా కాంట్రాక్టర్లు పనులు నిలుపుదల చేస్తామని హెచ్చరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహబూబాద్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ బాధ్యులు రావుల సతీష్ రెడ్డి మార్నెని రఘు పల్లపు రామకృష్ణారెడ్డి ఉపేందర్ గోగుల రాజు రాజేష్ సమద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News