బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తొమ్మిది రోజులు భక్తి శ్రద్దలతో బతుకమ్మను కొలిచారు. బతుకమ్మ వద్ద పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ, తొమ్మిది రోజులు సంబురాలు చేసుకున్నారు. బుధవారం రోజున కొత్త ధాంరాజ్ పల్లిలో బతుకమ్మని నిమజ్జనం చేశారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మ పేర్చి, రకరకాలుగా బతుకమ్మలు తయారు చేశారు. మహిళలు, చిన్నారులు నృత్యాలు, కోలాటలతో అలరించారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం సరిత, ఎంపీపీ కాటిపల్లి సరోజ, ఉపసర్పంచ్ బట్టు లత, గ్రామ మహిళలు పాల్గొన్నారు.