కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రెడ్డిలు అందరూ కలిసి ఎమ్మెల్యే నివాసంలో స్థానిక శాసనసభ్యులు విద్యాసాగర్ రావును కలిశారు. ఎమ్మెల్యేతో కలిసి తమ విన్నపాలను విన్నవించుకున్నారు. దాదాపు 5,000 మంది రెడ్డి కుటుంబాలు అందరూ కలిసి ఒక రెడ్డి సంక్షేమ సంఘభవనం నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నామని, మెట్పల్లి కోరుట్ల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిలో గల 5 ఎకరాల భూమిని కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తొందరలోనే రెడ్డి సంఘ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తామని సంఘ సభ్యులకు తెలిపారు. అలాగే రాజ్ బహదూర్ వెంకట్ రామిరెడ్డి విగ్రహం మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఏర్పాటు చేస్తామని అడగగా, సానుకూలంగా స్పందించారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహాన్ని తానే కొనిస్తానని రెడ్డి సంఘ సభ్యులకు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలత పట్ల రెడ్డిలు హర్ష వ్యక్తం చేస్తూ తొందరలోనే స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు.ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ రెడ్డి ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ రెడ్డిలు పాల్గొన్నారు.