మండల కేంద్రంలో అద్వైత పాలీ క్లినిక్ హాస్పిటల్ ను కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల కేంద్రంలో హాస్పిటల్ ప్రారంభించడం శుభ పరిణామమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డు రాజేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన అదిరెడ్డి, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తసీల్ధార్ రవీందర్, ఎంపీడీవో రాజశ్రీనివాస్, ఎంపీటీసిలు ఆకుతోట రాజేష్, మరిపెళ్లి సత్తమ్మ మల్లయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మైదాసు శ్రీనివాస్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు ఏనుగు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.