Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: కోరుట్ల కాంగ్రెస్ లో నయా జోష్

Mallapur: కోరుట్ల కాంగ్రెస్ లో నయా జోష్

కోరుట్ల నియోజకవర్గం లో రేవంత్ పాదయాత్ర తో నియోజకవర్గ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. యాత్ర సక్సెస్ కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఈనెల 11వ తేదీన కోరుట్ల లో జరిగిన హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్బంగా రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభం కు ముందే ప్రధానంగా రెండు వర్గాల వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎవరికి వారే యాత్రకు ఏర్పాట్లలో మునిగిపోయారు. అయితే ప్రతీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడి అధ్వర్యంలో యాత్ర జరపాలని కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది. అందులో భాగంగా కోరుట్ల లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్న జువ్వాడి ఈమధ్య పార్టీ కార్యక్రమాలలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి యాత్ర తన చేతుల మీదుగా జరిపించాలని, కల్వకుంట్ల సుజిత్ రావు యాత్రలో పాల్గొంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని అధిష్టాన పెద్దలకు తెలియజేసినట్లు సమాచారం.

- Advertisement -

కాంగ్రెస్ పెద్దలు కల్వకుంట్ల సుజిత్ రావును మెప్పించి యాత్ర ఏర్పాట్లు జువ్వడి నర్సింగా రావుకు అప్పగించారు. అక్కడిదాకా బాగానే ఉంది .కానీ యాత్ర ఏర్పాట్ల పనులు ముందుకు సాగకపోవడం, అదేవిదంగా ఈ మధ్యకాలంలో ఆయన బీజేపీ లో చేరుతున్నారని బిజెపి పెద్దలతో చనువుగా ఉంటున్నారని వార్తలు రావటంతో కాంగ్రెస్ అధిష్టానానికి అతనిపై నమ్మకం పోయింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన బిజేపి ఎంపీ కూడా ఈరోజు మాట్లాడిన మాటలు అతను బిజెపిలోకి వెళతారు అనే మాటల్ని బలపరుస్తున్నాయి. ఇక చివరినిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం కల్వకుంట్ల సుజిత్ రావును యాత్రను విజయవంతం చేయవలసిందిగా ఆదేశించడంతో, యాత్ర ఏర్పాట్లలో పూర్తిగా మునిగిపోయి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ అభిమానులను, కార్యకర్తలను యాత్రకు తరలించి యాత్ర విజయవంతంలో ముఖ్యపాత్ర పోషించారు. దీంతో ఇతర నాయకులు యాత్రలో నామమాత్రంగా మిగిలిపోవడంతో సుజిత్ రావు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలారు. యాత్రకు సుజిత్ రావుతోనే ఊపు వచ్చిందని కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

మొత్తం మీద ఈ యాత్ర రకరకాల ఊహాగానాలు, వర్గపోరు బయటపడ్డప్పటికీ సుజిత్ రావుకు కలిసివచ్చిందనే కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. యాత్ర విజయవంతం చేయడం పట్ల సుజిత్ రావ్ ను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జాదేవ్, కాంగ్రెస్ పెద్దలు ప్రశంసించినట్లు తెలుస్తుంది. సుజిత్ రావును కాంగ్రెస్ పెద్దలు ప్రశంసించడం పట్ల సుజిత్ రావు అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News