Sunday, June 30, 2024
HomeతెలంగాణMallapur: సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

Mallapur: సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్

మల్లాపూర్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన అధ్యక్షతన చిట్ట చివర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

- Advertisement -

ఈ సందర్భంగా అధికారులపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజల పట్ల వివక్ష చూపవద్దని, నాయకులూ విపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో చెట్లు నాటితే విద్యుత్ అధికారులు చెట్లను కొట్టు వేస్తున్నారని దీని వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని అధికారులు నేరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రైతులకు రైతుబంధు డబ్బులు పడకున్నా, పడ్డాయని చెబుతున్నారని దీనిపై సమీక్ష చేసి రైతులకు అకౌంట్ లలో డబ్బులు పడేలా చూడాలని కోరారు.

మండలంలో సంబంధిత అధికారులు ప్రజల విన్నపాలను పట్టించుకోవడంలేదని ప్రతి ఒక్క అధికారి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎంపీటీసీల చిట్ట చివరి సర్వసభ్య సమావేశం పట్ల ఐదేళ్ల కాలంలో వారు చేసిన సేవలను కొనియాడుతూ రాబోయే రోజులలో మంచి స్థానంలో ఉండాలని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. చిట్ట చివరి సర్వ సభ్య సమావేశానికి స్థానిక జడ్పిటిసి సంది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అధికారులు హాజరు కాకపోవడం విశేషం.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్ రెడ్డి, ఎంపీ ఓ సతీష్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News