గత ప్రభుత్వంలో మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజా ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని, వచ్చే సంవత్సరం లోపు చక్కెర కార్మికుల పునః ప్రారంభం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతుందని మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగా బ్యాంకులకు బాకీ పడ్డ 43 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల కృషితో తొందర్లోనే ముత్యంపేట బోధన్ చక్కెర కర్మాగారాలను పునః ప్రారంభం చేస్తారని, లోక్ సభ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పక్షాన నిలబడాలని, రైతు బిడ్డ జీవన్ రెడ్డి ని మెజారిటీతో గెలిపించాలని చిన్నారెడ్డి కోరారు.