ఎస్సారెస్పీ కాలువ నీళ్లు కావాలని కోరుతూ మండలంలోని కొత్త దాంరాజ్పల్లి, సంగేమ్ శ్రీరాంపూర్ గ్రామాలకు చెందిన రైతులు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుని వారి స్వగృహంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎస్సారెస్పీ నీళ్ల కోసం కొట్లాడుతున్నామని, చివరి ఆయకట్టైన మాకు నీళ్లు ఇప్పటికీ రావడంలేదని, రెండు గ్రామాల రైతుల సమస్యల దృష్టిలో ఉంచుకుని ఎస్సారెస్పి కాలువ నీళ్లు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేని రైతులు కోరారు.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి వారంలోపు కాలువ పరిశీలన చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు వచ్చి మీ సమస్యకు శాశ్వత పరిస్కారం చేస్తారని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. తమ సమస్యను ఎమ్మెల్యేకు తెలుపగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో రెండు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సంగేమ్ శ్రీరాంపూర్ సర్పంచ్ పాలెపు దిలీప్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బద్దం నర్సారెడ్డి, నిగ రవి, దేవర సురేష్, బద్దం దినేష్, వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేను కలిసినవారిలో ఉన్నారు.