Monday, November 17, 2025
HomeతెలంగాణMallapur: జగిత్యాల-బాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా సుజిత్ రావు

Mallapur: జగిత్యాల-బాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా సుజిత్ రావు

సంతోషంలో సుజత్ అభిమానులు

లోక్ సభ ఎన్నికల దృష్ట జగిత్యాల బాల్కొండ నియోజకవర్గలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు నియమితులయ్యారు. ఈమేరకు ఎన్నికల ఇంచార్జిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిగా నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

తనపై నమ్మకంతో జగిత్యాల, బాల్కొండ నియోజకవర్గల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు సుజిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. తమ నాయకునికి రెండు నియోజకవర్గాల ఇంచార్జిగా బాధ్యతలు రావటం పట్ల సుజిత్ రావు అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad