Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: ఈ బ్రిడ్జి యమా డేంజర్

Mallapur: ఈ బ్రిడ్జి యమా డేంజర్

మీరు ఇటుగా వెళ్తుంటే ..

నిత్యం వేలాది మంది ప్రయాణించే ఖానాపూర్ – మెట్ పల్లి రహదారిలో ఓబులాపూర్ – మొగిలిపేట గ్రామాల మధ్య మల్లెం పంపు ఒర్రె మీద నిర్మించిన బ్రిడ్జికి భారీ ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జిపై ఇనుప చువ్వలు పైకి తేలి అత్యంత ప్రమాదస్థితికి చేరుకుంది.

- Advertisement -

ఇనుప చువ్వలు పైకి తేలడంతో ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. నిత్యం వేలాది మంది ఈ దారి వెంట ప్రయాణిస్తారు. రాత్రి పూట ఆదమరిచి ఎవరైనా అటువైపు ప్రయాణం చేస్తే ప్రమాదం జరగచ్చని ప్రయాణికులు పదేపదే లబోదిబోమంటున్నా ఎవరూ ఇప్పటివరకూ స్పందించిన పాపాన పోలేదు.

చాలా రోజుల నుండి బ్రిడ్జిపైన తేలిన ఇనుప కడ్డీలు రోడ్డుపై ప్రయాణించేవాళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యం ఇదే రహదారి పై ప్రయాణించే రవాణా శాఖ అధికారులు కూడా ప్రమాదాన్ని పసిగట్టి మరమ్మతులు చేపట్టేందుకు చొరవ చూపకపోవటం విశేషం.

ఓవైపు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలుతుండగా ప్రతిష్ఠాత్మకంగా కట్టిన ప్రాజెక్టులు సైతం భారీ డ్యామేజీలకు గురవుతున్నాయి. కాగా ఇలా డ్యామేజ్ అయిన వంతెనలను కనీసం ఎప్పటికప్పుడు రిపేరీలు చేయకపోతే రోడ్డెక్కిన వారు ఇంటికి సురక్షితంగా చేరే పరిస్థితి ఉండదు. రోడ్డు ప్రమాదాలకు, రోడ్డు భద్రతా లోపాలకు ప్రధాన కారణంగా రోడ్ల మరమ్మతులు సకాలంలో సాగకపోవటమేనని రిపోర్టులు కుండబద్ధలుకొడుతున్నా సంబంధిత శాఖ మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరించటం రొటీన్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad