Friday, September 20, 2024
HomeతెలంగాణManakonduru: 24 గం. ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే

Manakonduru: 24 గం. ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే

నిరంతరం మెరుగైన విద్యుత్ అందించడంలో విద్యుత్ రంగ అధికారులు, సిబ్బంది కృషి మరువలేనిది

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ రంగ అధికారులు, సిబ్బంది కృషి మరువలేనిదని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ (8వ డివిజన్) లోని శ్రీలక్ష్మీ నర్సింహా కన్వెన్షన్ హాలులో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. రసమయితో పాటు కరీంనగర్ సుడా చైర్మన్, బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి.రామకృష్ణ రావులు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ…సీమాంద్ర పాలనలో విద్యుత్ సమస్యలతో వ్యవసాయ సాగు పంటలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఉండేవని, విద్యుత్ ఓల్టేజ్ సమస్యలతో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, కరెంటు లేకుండా కూడా అడ్డగోలు బిల్లులు దోచిన ప్రభుత్వాలు ఉన్నాయని, బషీర్ బాగ్ లో ధర్నా చేసిన సంఘటనలు ఆయన గుర్తుచేశారు. గతంలో బిల్లులు కట్టలేక ధర్నాలు, ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన రోజులు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ సారథ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ నిరంతరంగా వస్తుదంటే మామూలు విషయం కాదని అన్నారు. నిరంతరం మెరుగైన విద్యుత్ అందించడంలో విద్యుత్ రంగ అధికారులు, సిబ్బంది కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ సమావేశంలో మానకొండూరు నియోజక వర్గంలోని జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు విద్యుత్ అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News