Monday, June 24, 2024
HomeతెలంగాణManakonduru: నా గెలుపు కోసం సైనికుల్లా కష్టపడండి

Manakonduru: నా గెలుపు కోసం సైనికుల్లా కష్టపడండి

50 వేల మందితో నామినేషన్

నా గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి భారీ మెజారిటీతో గెలిపించాలని, కార్యకర్తలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. రాజేందర్ రావు ఇల్లందకుంట రామాలయంలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణంలో పాల్గొని కరీంనగర్ వెళ్తూ మానకొండూర్లో కొద్దిసేపు ఆగారు. తొలిసారిగా మానకొండూర్ కు రావటంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందగిరి రవి, కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రావును శాలువాతో సత్కరించారు.

- Advertisement -

ఈ సందర్బంగా ఎంపి అభ్యర్థి రాజేందర్ రావు మాట్లాడుతూ…కాంగ్రెస్ అధిష్టానం నన్ను గుర్తించి ఎంపి టికెట్ ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మీ సహకారంతో విజయం సాధించి మీకు అండగా ఉంటానన్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో వేగం పెంచి గడప గడపకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పని చేసిన నాన్న వెలిచాల జగపతి రావు చేసిన సేవలను ప్రజలు నేటికీ మర్చిపోలేదని, నాన్న కంటే ఎక్కువ సేవ చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తానని రాజేందర్ రావు చెప్పారు. గురువారం తిమ్మాపూర్ మండలం అల్గునూర్లోని ఎఎంఆర్ ఉన్నతి ఫంక్షన్ హాల్ లో కరీంనగర్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరుగనుందని తెలిపారు. సమావేశానికి ముందు హైదరాబాద్ నుండి వచ్చే మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపి అభ్యర్థి అయిన తనకు పార్టీ శ్రేణులు సిద్దిపేట జిల్లా శనిగరం వద్ద ఘన స్వాగతం పలుకనున్నారని రాజేందర్ రావు తెలిపారు.

ఈ నెల 22 న సుమారు 50 వేల మందితో వెళ్లి నామినేషన్ వేస్తానని వెల్లడించారు. నామినేషన్ కు భారీగా తరలి రావాలని రాజేందర్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేత కూన శంకర్ ముదిరాజ్, మానకొండూర్ మాజీ సర్పంచ్ మడుపు శ్యాంసుందర్, అన్నమనేని నర్సింగ రావు, వరహాల చారి, మడుపు ప్రేమ్ కుమార్, కొత్తకొండ శంకర్, జడల రమేష్, రామిడి తిరుపతి, కోండ్ర సురేష్, నందగిరి రమేష్, పాశం కనుకయ్య, పిట్టల వెంకటేష్ ముదిరాజ్, ఆకునూరి మల్లయ్య, రాజయ్య, వీరారెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News