Thursday, September 19, 2024
HomeతెలంగాణManchiryala: పశుగ్రాసం కోసం వలస వచ్చిన ఒంటెలు

Manchiryala: పశుగ్రాసం కోసం వలస వచ్చిన ఒంటెలు

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కొందరు గొర్రెలు, మేకల కాపరులు అక్కడ పశువుల గ్రాసం కొరత ఉండడంతో వాటితో పాటు తమ ఒంటెలను తీసుకొని మంచిర్యాల జిల్లాకు వలస వచ్చారు.

- Advertisement -

జైపూర్ -భీమారం అటవీ ప్రాంతాన్ని అనుకోని ఉన్న జాతీయ రహదారి మీదుగా ఈ పశువులు మేసుకుంటూ వెళ్తున్న క్రమంలో వాటిని జైపూర్ టీజీ ఎఫ్డీసీ ప్లాంటేషన్ వాచర్ ఎ. సాయికిరణ్ ఫోటోలు తీసి మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. పశుగ్రాసం కొరత ఉన్న సమయాల్లో ఇతర ప్రాంతాల నుంచి పశువులు వలస రావడం సహజమే అన్నారు. ఒంటెలను మేపడంతో పాటు ఆ పశువుల కాపరుల సామాగ్రిని మోయడంతో పాటు వారు కొంత దూరం ప్రయాణం చేయడానికి ఈ ఒంటెలను ఉపయోగిస్తుంటారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News