పాత మంచిర్యాలలోని గోదావరి నది ఒడ్డున ఉన్న గంగాదేవి ఆలయంలో మంచిర్యాల గంగపుత్రులంతా తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గంగాదేవికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నెన్నల నరసయ్య మాట్లాడుతూ… గంగాదేవి ఆశీస్సులు కుల బాంధవుల మీద ఉండాలని అలాగే గంగపుత్రులకు సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించాలని అలాగే మంచిర్యాల పట్టణంలో మోడరన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాలని రాముని చెరువు మత్స్య శాఖ ఆధీనంలో ఉండే విధంగా చర్య తీసుకోవాలని, గంగపుత్రలకు రాజకీయరంగంలో తగిన ప్రాథమిక కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, కునారపు చందు, చెట్టుపల్లి గట్టయ్య, రాష్ట్ర నాయకులు వంగల దయానంద్, ఎర్రోళ్ల మల్లయ్య, బోరే యాదగిరి, బోడెంకి మహేష్, గుమ్మల రమేష్, మంగిడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.