Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: ఏప్రిల్ లో 108% 60 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి

Manchiryala: ఏప్రిల్ లో 108% 60 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి

హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఏర్పాటు చేసిన సింగరేణి ఏరియాలోని జనరల్ మేనేజర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ… సింగరేణి సంస్థ గతేడాది ఇదే నెలలో జరిపిన రవాణాపై 5.7 శాతం వృద్ధి ఏప్రిల్ నెలలో 12.6 శాతం వృద్ధితో 422 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు ఈ నెలలో రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.26 లక్షల టన్నుల రవాణా జరపాలి ప్రతిరోజు 15.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి, సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి నెల అయినా ఏప్రిల్ లో 60 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి గత ఏడాది ఇదే నెలలో జరిపిన రవాణాపై 5.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 4.7 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో 12.6 శాతం వృద్ధిని సాధించింది. మే నెలలో సాధించాల్సిన లక్ష్యాలను ఏరియాలకు నిర్దేశించారు. ఏప్రిల్ నెలలో నిర్దేశించిన 55.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే నిర్దేశిత 55.8 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు గాను 108 శాతం తో 60 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపామని, అలాగే నిర్దేశిత 410 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాన్ని దాటి 102 శాతంతో 422 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించ గలిగామని అభినందించారు. ఇదే ఒరవడితో మే నెలలో మరింత మెరుగుగా పనిచేసి, నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని ఆయన అన్ని ఏరియాల జీఎంలను, కార్మికులను కోరారు. మే నెలలో 67.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని, దీని కోసం రోజుకు కనీసం 2.20 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలన్నారు. ఇదే నెలలో 70 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలని, దీని కోసం రోజుకు కనీసం 2.26 లక్షల టన్నుల రవాణాకు సంసిద్ధం కావాలన్నారు. మే నెలలో 48.05 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని దీనికోసం రోజుకు కనీసం 15.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని నిర్దేశించారు. అన్ని ఏరియాలో కొత్త ప్రాజెక్టుల ప్రాంతానికి అవసరమైన భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై ఏరియాల్లో జనరల్ మేనేజర్లు నిరంతరాయంగా స్థానిక కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, రెవిన్యూ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఏ పనులు కూడా పెండింగ్ లో లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పా ఎన్.బలరామ్, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్.వి.కె. శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News