తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కలిశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలోని లోపాలు, ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/GjfmAyRbQAAdPsG-1024x584.jpg)
ఈ భేటీ అనంతరం మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వివిధ సందర్భాల్లో ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచారని గుర్తు చేశారు. తాను కూడా ఆయనకు అండగా నిలుస్తానని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయడంలో రేవంత్‌రెడ్డి భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని పేర్కొన్నారు. ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తారని ఆశిస్తున్నాం వెల్లడించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Gjfl_dsa0AAcwPp-1024x618.jpg)