అధికారులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతో జిహెచ్ఎంసి కి అవార్డులు వచ్చాయి అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2023 కింద హైదరాబాద్ నగరానికి 5 అవార్డులు సాధించిన నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కేంద్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి మంత్రివర్యులు హర్ దీప్ సింగ్ పూరీ చేతుల మీదుగా అవార్డు ను అందుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం అవార్డులను శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రధాన కార్యాలయంలో అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి లో సిబ్బంది, అధికారులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతో అవార్డులు సాధించుకున్నామని, రానున్న సంవత్సరం లో జిహెచ్ఎంసి కి దేశంలో అవార్డు లు రావాలని, అందుకు అధికారులు, సిబ్బంది, కార్మికులు విశేష కృషి , ప్రజల సహకారం ఎంతో అవసరమని మేయర్ అన్నారు.
అవార్డులు వివరాలు అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మేయర్ కు వివరించారు.
- భారతదేశంలో 9వ క్లీన్ సిటీ
- భారతదేశంలో 5 స్టార్ రేటింగ్ పొందిన చెత్త రహిత నగరం
- తెలంగాణలో స్వచ్ఛ నగరం
- తెలంగాణలో మొదటి 5 స్టార్ రేటింగ్ పొందిన నగరం (జనాభా > 1 లక్ష)
- వాటర్+ సిటీగా మళ్లీ ధృవీకరించబడింది.