Saturday, October 5, 2024
HomeతెలంగాణMedaram: మేడారం జర్నలిస్టులకు ప్రత్యేక ఏర్పాట్లు

Medaram: మేడారం జర్నలిస్టులకు ప్రత్యేక ఏర్పాట్లు

హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరను కవర్ చేస్తున్న ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కారు. మేడారం మహా జాతర విశేషాలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశారు.

- Advertisement -


సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర విశిష్టతను, ఆదివాసి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రస్ఫుటించే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పాటు ప్రజలకు మధ్య అనుసంధానంగా సేవలు అందిస్తున్నారు. మహా జాతర విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ ను ఐ.టీ.డీ.ఏ గెస్ట్ హౌస్ ఎదురుగా ఏర్పాటు చేసింది.

మీడియా సెంటర్లో వీడియో ఫుటేజ్ ఫోటోలు పంపేందుకు 100 ఎంబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, జాతర ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా ఫోటో ప్రదర్శన వివిధ కళా బృందాలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

జాతర కవర్ చేసే జర్నలిస్టులకు అవసరమైన భోజన వసతి కంప్యూటర్లు హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News