Sunday, October 6, 2024
HomeతెలంగాణMetro: శరవేగంగా ఎయిర్ పోర్ట్ మెట్రో పనులు

Metro: శరవేగంగా ఎయిర్ పోర్ట్ మెట్రో పనులు

ఎయిర్ పోర్టుకు మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పెగ్ మార్కింగ్ కూడా పూర్తైంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు ఎయిర్ పోర్ట్ మెట్రోను 6,250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. మూడేళ్లలో మెట్రో నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. మెట్రో కారిడార్‌లోనే చెక్ ఇన్ చేసుకునేలా అత్యాధునికంగా ఈ స్టేషన్స్ ను నిర్మిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా ఎయిర్ పోర్టు చెక్ ఇన్ రష్ కూడా పూర్తిగా తగ్గే అవకాశాలున్నాయి. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ 5 కిలోమీటర్లకు మెట్రో విస్తరణకు సంబంధించి డీపీఆర్ ఇప్పటికే సమర్పించారు. ఈనేపథ్యంలో హైదరాబాద్ నలుమూలలా మెట్రో సేవలు అందుబాటులోకి తెస్తే చుట్టుపక్కల జిల్లాల వారికి హైదరాబాద్ వచ్చిపోయేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News