Sunday, November 16, 2025
HomeతెలంగాణDanam Nagender: కూల్చివేతలు ఆపండి.. అధికారులపై దానం నాగేందర్‌ ఆగ్రహం

Danam Nagender: కూల్చివేతలు ఆపండి.. అధికారులపై దానం నాగేందర్‌ ఆగ్రహం

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) మరోసారి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలో కూల్చివేతలు చేపట్టిన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలో బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా షాదన్‌ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న దానం అక్కడికి చేరుకొని కూల్చివేతలను అడ్డుకున్నారు.

- Advertisement -

స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. కూల్చివేతలు వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదోళ్లపై దౌర్జన్యం ఏంటని ధ్వజమెత్తారు. దావోస్‌ నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad