Tuesday, September 17, 2024
HomeతెలంగాణKoppula: మోడీకి సింగరేణి సెగ తగిలేలా మహాధర్నా చేద్దాం

Koppula: మోడీకి సింగరేణి సెగ తగిలేలా మహాధర్నా చేద్దాం

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నానిరసన సెగలు హైదరాబాద్ కు వస్తున్న నరేంద్ర మోడీని తాకాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరోమారు సింగరేణి జంగ్ సైరన్ పూరించనున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.  శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యుద్ధభేరి మహాధర్నా నిర్వహించనున్నారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి, చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని, సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం మాత్రం కుట్రపూరితంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందన్నారు. అటు సింగరేణి కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు సైతం ఏక కంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరుతున్నా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని మంత్రి కొప్పుల  డిమాండ్ చేశారు. సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని, ఇక్కడి ప్రజలకు ఇదే ప్రధానమైన బతుకుదెరువన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News