Thursday, November 21, 2024
HomeతెలంగాణNagarjuna Sagar to Srisailam Tour: కృష్ణా నదిలో నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్...

Nagarjuna Sagar to Srisailam Tour: కృష్ణా నదిలో నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం ప్రారంభం

Nagarjuna Sagar to Srisailam Tour| తెలంగాణలోని నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచ్ ప్రయాణం ప్రారంభమైంది. సాయంత్రానికి లాంచ్ శ్రీశైలం చేరుకోనుంది. రాత్రికి అక్కడే బస చేసి.. స్వామివారి దర్శనం అనంతరం రేపు మళ్లీ తిరిగి లాంచ్ సాగర్‌కు చేరుకోనుంది. దాదాపు 100 మంది ప్రయాణికులతో ఫల్లుణ లాంచ్ బయలుదేరింది. ఓవైపు కృష్ణానది పరవళ్లు.. మరోవైపు చుట్టూ కొండలు.. నల్లమల్ల అడవి అందాలు.. ఇలా ఎన్నో ప్రకృతి అందాలను అస్వాదించవచ్చు. ఈ ప్రయాణానికి దాదాపు 6 నుండి 7 గంటల సమయం పడుతుంది.

- Advertisement -

ఈ అందాలను అస్వాదించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా డబుల్ డెక్కర్ స్టైల్ AC లాంచ్ ఏర్పాటు చేసింది. ఓవైపు వెళ్లేందుకు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు. ఇక రెండు వైపుల ప్రయాణానికి0 రౌండర్ టూర్ ప్యాకేజీ కింద పెద్దలకు రూ.3000, పిల్లలకు రూ.2400గా ధర నిర్ణయించారు.

ఈ టూర్‌లో భాగంగా మీ ప్రయాణం బుక్ చేసుకోవాలంటే https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదా 9848540371 లేదా 9848306435ను సంప్రదించండి. అలాగే [email protected]కు కూడా మెయిల్ చేయవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు అక్టోబర్ 26 నుంచి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచ్ జర్నీ కూడా అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News