Sunday, November 16, 2025
HomeతెలంగాణNama Nageswar Rao: చెరువులన్నీ 'గలగల' రైతుల ముఖాల్లో 'కళకళ'

Nama Nageswar Rao: చెరువులన్నీ ‘గలగల’ రైతుల ముఖాల్లో ‘కళకళ’

చెరువులన్నీ “గలగల”రైతుల ముఖాల్లో” కళకళ”సాగునీటి దినోత్సవ వేడుకల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి వారి ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైరా శాసనసభ్యులు. లావుడియ రాములు నాయక్ జండా ఊపి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి వైరా పాత సెంటర్ రింగ్ రోడ్డు మీదగా వైరా రిజర్వాయర్ ఆయకట్టు వరకు ప్రత్యేక గిరిజన నృత్యాలతో, కళాకారులతో కోలాటాలతో డప్పులతో, ట్రాక్టర్ ర్యాలీతో వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొద్దిసేపు డప్పు వాయిస్తూ, నృత్యం చేస్తూ వచ్చిన నాయకులు, అధికారులు, ప్రజలు కళాకారులను ఉత్తేజపరిచారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ,రెవెన్యూ శాఖ అధికారులు, మత్స్య శాఖ వారు వైరా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad