Sunday, October 6, 2024
HomeతెలంగాణNama Nageswara Rao: బీసీ బిడ్డ రవిచంద్రకే ఇవ్వాలని కేసీఆర్ ను కోరాం

Nama Nageswara Rao: బీసీ బిడ్డ రవిచంద్రకే ఇవ్వాలని కేసీఆర్ ను కోరాం

పార్లమెంటు ఎన్నికల్లో నన్ను గెలిపించండి

ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ బిడ్డ వద్దిరాజు రవిచంద్రకే రాజ్యసభ సీటు ఇచ్చి మరింతగా బీసీలను ప్రోత్సహించాలని కేసీఆర్ ను కోరినట్టు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన వద్దిరాజు రవిచంద్ర అభినందన , కృతజ్ఞత సభలో నామ ముఖ్య అతిధిగా పాల్గొని రవిచంద్రను అభినందించారు. పలుమార్లు కేసీఆర్ వద్ద రవిచంద్ర పేరు ప్రస్తావించిన ఫలితంగా రవిచంద్రను రెండోసారి కూడా రాజ్యసభకు ఎంపిక చేయడం బీసీలకు దక్కిన అరుదైన గౌరవమని అన్నారు.

- Advertisement -

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అన్నదమ్ముల్లా అండగా ఉండి పార్లమెంట్ లో జిల్లా ప్రజల వాణిని మరింత బలంగా వినిపిస్తామని చెప్పారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం విశ్వాసం ఉందన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, కనుక ప్రజల మద్దతు నాకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో తెలంగాణా బిల్లు సందర్భంగా తెలంగాణా బిడ్డగా తన మొదటి ఓటు వేశానని, ఇందుకు కేసీఆరే సాక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా నామ, రవిచంద్రను శాలువతో ఘనంగా సన్మానించి, అభినందించారు.

ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఓబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆధార్టీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, తెలంగాణా ఉద్యమ జేఏసీ చైర్మైన్ తన్నీరు వెంకటేశం, గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుట్టం పురుషోత్తం, సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల వెంకట రమణ, బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మెర రామూర్తి, మాజీ ఎమ్మెల్యే లు బాణోత్‌ మదన్‌లాల్‌, హరిప్రియ, చంద్రావతి, జెడ్పీ ఛైర్మన్‌ లింగాల కమలరాజు, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, మాజీ డీసీసీబీ అధ్యక్షులు కూరకుల నాగభూషణం,జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి. ప్రకాష్, బీసీ కమీషన్ తొలి సభ్యులు, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరి శంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మానవతా రాయ్ , బచ్చు విజయకుమార్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ తో పాటు వివిధ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపీలు, జెడ్పీటీసీ, ఎంపిటీసీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News