శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఆర్కే-7 గని ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గని వెంటిలేషన్ అధికారి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో అధికారులకు, ఉద్యోగులకు పర్యావరణంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, గని మేనేజర్ సాయి ప్రసాద్, సంఘం పిట్ సెక్రటరీ మేండే వెంకటి పాల్గొన్నారు. అనంతరం గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, గని మేనేజర్ సాయి ప్రసాద్, వెంటిలేషన్ అధికారి జగదీశ్వర్ రావు మాట్లాడుతూ మే 19 నుండి జూన్ 05 వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని చేయాలని అధికారులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మన జీవితంలో పర్యావరణం మనలో ఒక భాగంగా ఉండే విధంగా మార్చుకోవాలని (మిషన్ లిఫెస్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) పర్యావరణ పరిరక్షణ ఒక లక్ష్యంగా భావించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పర్యావరణాన్ని రక్షించుకోవడం వల్లనే జీవకోటి మనగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ తమవంతుగా తమతమ పుట్టిన రోజున ఒక మొక్కను నాటి పర్యావరణ భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవి శంకర్, అండర్ మేనేజర్లు వెంకటరామ్, లక్ష్మణ్, ఇంజనీర్లు తోట రమేష్, సుధీర్ రెడ్డి, సంక్షేమ అధికారి శాంతన్ తదితరులు పాల్గొన్నారు.