Friday, November 22, 2024
HomeతెలంగాణNuguru: ఎండిన పంటకు తక్షణమే నష్టపరిహారమివ్వాలి

Nuguru: ఎండిన పంటకు తక్షణమే నష్టపరిహారమివ్వాలి

పక్కనే గోదావరి అయినా ఎండిన..

అన్నదాతలు ఆరుగారం శ్రమించి కష్టపడి పండించిన వరి మొక్కజొన్న మిరప పంటలు చేతికి వచ్చి సాగునీరు అందక పంటల మొత్తం ఎండిపోయి రైతులు మొత్తం నష్టపోయారని నష్టపోయిన రైతులను నష్టపరిహారం అందజేసి తక్షణమే ఆదుకోవాలని ఎఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్సా నరసింహా మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బర్లగూడెం గ్రామ పంచాయతీలోని వరి పంటలను రైతులతో కలిసి సందర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పాలెం ప్రాజెక్టు నీళ్లు అందక రైతులు వేసిన పంటను చేతికి వచ్చి ఎండిపోయి రైతులు అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గోదావరి నది జలాలు ప్రక్కనే ప్రవహిస్తున్నా ఈ ప్రాంత రైతాంగానికి చుక్క సాగునీరు కూడా ఉపయోగపడటం లేదని వాపోయారు. ఈ ప్రాంత గోదావరి జిల్లాలను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఈ ప్రాంత రైతాంగానికి పాలకులు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని ఆరోపించారు. ఈ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన పాలెం వాగు ప్రాజెక్టు కూడా రైతులకు నిరుపయోగంగా మారిందన్నారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు నీరును బాగు చేయకుండా వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాసింగిలో వేసిన రైతుల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. సంబంధిత ప్రాజెక్టు అధికారులు అందుబాటులో కూడా ఉండడం లేదని వాపోయారు.

ప్రాజెక్ట్ నిర్మాణ చేపట్టి దశాబ్ద కాలం దాటుతున్న ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు కాలేదు అన్నారు. ఈ ప్రాంత అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టు పైన ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు కళ్ళముందే ఎండిపోవడంతో రైతులు కన్నీటిపర్యంతం అయినట్లు తెలిపారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రజా ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు ఇరప బాబు, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News