Saturday, May 18, 2024
HomeతెలంగాణPalakurthi: వైభవంగా వల్మిడి శ్రీ సీతారాముల కళ్యాణం

Palakurthi: వైభవంగా వల్మిడి శ్రీ సీతారాముల కళ్యాణం

పెద్ద సంఖ్యలో భక్తులు

పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని మరో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీ రామ నవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య విశేష పూలా అలంకరణ తో మేళా తాళాలతో, భజనాలతో భక్త కోటి అంతా కూడా జై శ్రీరామ్ జై బోలో శ్రీ సీతారామ చంద్ర స్వామికి జై అంటూ మండుటెండను సైతం లెక్కచేయకుండా అశేష భక్త జనం కల్యాణ మహోత్సవం కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి ఆశీస్సులు తీసుకొని తరించిపోయారు.

- Advertisement -

ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమనికి స్థానిక ఎమ్మెల్యే దంపతులు మామిడాల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ లేగా రామ్మోహన్ రెడ్డి, అతిరథ మహారధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, ప్రజలు, యువతి యువకులు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమనికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు గా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పాలకుర్తి సర్కిల్ పరిధిలో ఉన్న పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల పోలీసులు ఏర్పాటు చేశారు. ఎండాకాలం దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక స్టాల్స్న్ ఏర్పాటు చేయగా అలాగే విద్యుత్ శాఖ అనుక్షణం విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు ను చేశారు. ఈ కార్యక్రమం రాజకీయ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News