Thursday, July 4, 2024
HomeతెలంగాణPeddagattu Jathara : పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

Peddagattu Jathara : పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

Peddagattu Jathara : తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద కుంభమేళ లింగమంతులస్వామి (పెద్ద గట్టు) జాతరకు నగారా మోగింది. జాత‌ర తేదీల‌ను సోమ‌వారం పాల‌క‌మండ‌లి ఖరారు చేసింది. మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి స‌మ‌క్షంలో నూత‌న పాల‌క‌వ‌ర్గం ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి 9 వ‌ర‌కు జాత‌ర జ‌ర‌గ‌నుంది. నూత‌న అధ్య‌క్షుడిగా కోడి సైదులు ప్ర‌మాణం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద‌గట్టు దేవ‌స్థానం అభివృద్ది కోసం నూత‌న పాల‌క వ‌ర్గం కృషి చేయాల‌న్నారు.

- Advertisement -

జాతర ప్రారంభానికి 15 రోజులు ముందు అంటే 22 జ‌న‌వ‌రి 2023 ఆదివారం రోజున దిష్టిపూజ మహోత్సవం జరుగుతుంది. అనంత‌రం ఫిబ్ర‌వ‌రి 5 నుంచి 9 వ‌ర‌కు అంటే ఐదు రోజుల పాటు జాత‌ర జ‌ర‌గ‌నుంది.

జాతర కార్యక్రమాలు

జ‌న‌వ‌రి 22- 2023 న ఆదివారం రాత్రి 11 గంట‌ల‌కు దిష్టి పూజ

ఫిబ్రవరి 5- 2023 ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుండి దేవర పెట్టె తీసుకువచ్చుట, గంపల ప్రదిక్షణ

ఫిబ్రవరి 06- 2023 సోమవారం, బోనాలు సమర్పించుట ముద్దెర పాలు ,జాగిలాలు పోయుట‌

ఫిబ్రవరి 07-2023 మంగళవారం గుడి ముందు పూజారులు చంద్రపట్నం వేయుట‌

ఫిబ్రవరి 08-2023 బుదవారం పూజారులు నెలవారం చేయుట, దేవ‌ర‌పెట్టే కేసారంకు తీసుకుపోవుట‌

ఫిబ్రవరి 09-2023 గురువారం, జాతర ముగింపు, మకరతోరణం ఊరేగింపుతో సూర్యాపేట‌కు తీసుకోనివ‌చ్చుట‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News