Pushpa 2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2’. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రీమిర్ షోలతో పాటు నార్మల్ షోల టికెట్ ధరలను తెలంగాణలో భారీగా పెంచడంపై ఓ వ్యక్తి తెలంగాణ హైకోర్టు(TG High Court)లో పిటిషన్ వేశారు. బెనిఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు వారాల్లో దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ‘పుష్ప2’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒకరోజు ముందే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్ షో’స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 పెంచింది. అలాగే డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్ కంటే రూ.200.. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100 అధికంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.