Wednesday, October 30, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: ప్రపంచానికి జ్ఞానం అందించే మొదటి వ్యక్తి గురువు

Rajanna Sirisilla: ప్రపంచానికి జ్ఞానం అందించే మొదటి వ్యక్తి గురువు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

ఉపాధ్యాయులకు సమాజంలో గౌరవప్రదమైన, ఉన్నతమైన స్థానం ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో రహీంఖాన్ పేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తూముకుంట మోహన్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోహన్ రెడ్డికి ఏర్పాటు చేసిన సన్మాన సభను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఉపాధ్యాయులకు ఎంతటి ఉన్నతమైన గౌరవం దక్కుతుందో అర్థం అవుతుంది అన్నారు. గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ లోకం మనుగడే ఉండదన్నారు. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉపాద్యాయుడి పాత్ర వెలకట్టలేనిది అని అన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

- Advertisement -

కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, మానువాడ శంకర్ ఎంఈఓ బన్నాజీ, ఏసిజిఎఫ్ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత,పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి గుర్రం సందీప్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News