Tuesday, September 17, 2024
HomeతెలంగాణThalakondapalli: కస్తూరిబాయి పాఠశాలలో 'ఓటర్ ప్రతిజ్ఞ'

Thalakondapalli: కస్తూరిబాయి పాఠశాలలో ‘ఓటర్ ప్రతిజ్ఞ’

ఓటును అమ్మకు అమ్ముడబోకు

హక్కుల కోసం అడిగే అవకాశం ఓటు హక్కు వినియోగించుకునే వారికి మాత్రమే ఉంటుందని డీపీఎం నరసింహ అన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత తెలియజేసేలా కస్తూరిబాయి హాస్టల్ విద్యార్థులతో ఓటు అవగాహనపై తలకొండపల్లి పట్టణంలో వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి డీపీఎం నరసింహ, సీసీలు, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణంలో ఓటరు ప్రతిజ్ఞ చేసారు.

- Advertisement -

ఈ సందర్భంగా డిపిఎమ్ నరసింహ మాట్లాడుతూ ఓటరు ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేలా ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. హక్కుల కోసం అడిగే అవకాశం ఓటు హక్కు వినియోగించుకునే వారికే ఉంటుందని, ఓటర్లు నిర్లక్ష్యం వహించడం పట్ల కలిగే నష్టాలను చెప్పారు. ఐదేళ్ల పాటు పాలించే వారిని ఎన్నుకునే అవకాశం ఓటరుకు ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఒక వజ్రాయుధం అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిపిఎమ్ నరసింహ, సీసీలు దీప, రాములు, విజయలక్ష్మి, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News