Saturday, July 27, 2024
HomeతెలంగాణRamadugu: ప్రమాదాల నివారణకు పొట్టి తాటిచెట్ల పెంపకం

Ramadugu: ప్రమాదాల నివారణకు పొట్టి తాటిచెట్ల పెంపకం

గౌడన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం

రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ పొట్టి తాటి మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఒక తాటి పండు మొలకలో ఉన్న పోషకాహారం సృష్టిలో మరి ఏ జాతిలో లేదని పరిశోధనలలో తేలింది అని అన్నారు. తాటి పండ్ల నుండి పెక్టిన్ అనే పదార్థం తీయవచ్చు. మన దేశం ఏటా 5000 కోట్ల పెక్టిన్ దిగుమతి చేసుకుంటున్నాం. దీనిపై పరిశోధనలు ప్రోత్సహిస్తాం. తాటి పండ్ల నుండి, గేగుల నుండి పిండి, పశువుల దాణా తయారీపై పరిశోధనలు మంచి ఫలితాలు ఇచ్చాయి అని అన్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా నలంద భగల్పూర్ జిల్లాలోని తాటి చెట్లు కేవలం ఐదు నుంచి 30 ఫీట్ల వరకే పెరిగి మన 100 ఫీట్ల తాటి చెట్లతో పోలిస్తే చాలా చిన్నవిగా ఉండటం వల్ల మన గీత కార్మికులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని గుర్తించి అక్కడ నుంచి ఆ విత్తనాలు తెప్పించి ఇస్తున్నాము.

- Advertisement -

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సొంత ఖర్చులతో పొట్టి తాటి చెట్టు విత్తనాలను బీహార్ రాష్ట్రం నుండి తెప్పించడం జరిగిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. గౌడన్నలకు 5లక్షల మరణ బీమా,3లక్షలతో ప్రమాదబీమను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నది. 50 సంవత్సరాలు నిండిన గౌడన్నలకు అసరా పెన్షన్లు ఇస్తున్నాం అని అన్నారు.హరితహారం కార్యక్రమం ద్వారా తాటి ఈత వనాలను పెంచడం జరుగుతుంది.ప్రభుత్వం ద్వారా ఈత చెట్లను,గిరక తాటి చెట్లు ఇవ్వడం జరుగుతుంది.50వేల పొట్టి తాడిచెట్లను (హైబ్రిడ్) అందించడం జరుగుతుంది.ప్రమాదాల నివారణకు హైబ్రిడ్ చెట్లను అందించడం జరుగుతుంది. గౌడన్నలు హైబ్రిడ్ చెట్లను సంరక్షించుకోవాలి. అని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్రావు మురళీకృష్ణ రెడ్డి మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎడవల్లి నరేందర్ రెడ్డి గౌడ సంఘం అధ్యక్షులు వెంకటయ్య ఉపాధ్యక్షులు సుద్దాల మల్లేశం గౌడ కులస్తులు వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News