Monday, June 24, 2024
HomeతెలంగాణRanjith Reddy: చేవెళ్ల ఎంపీ జన్మదిన వేడుకలు

Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ జన్మదిన వేడుకలు

పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా, ఎంపీని కలిశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండలం మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు గణేష్ గుప్త, చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, మేయర్ మహేందర్ గౌడ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి, దీపా మల్లేష్ ,కౌన్సిలర్లు అమృతా రెడ్డి , మేకల వెంకటేష్, సింగల్ విండో చైర్మన్ దవణాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, కొనమల శ్రీనివాస్, బుచ్చి రెడ్డి,ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి, మంచర్ల శ్రీనివాస్, కర్ణం జ్ఞానేశ్వర్, వీరమల్ల హనుమంతు ,కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు,డైరెక్టర్లు, పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపి రంజిత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరిణీ అవరణలో మొక్కను నాటారు. మొయినాబాద్ మండల కేంద్రంలో ఎంపి రంజిత్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు గజమాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చేవెళ్ల శాసన సభ్యుడు కాలె యాదయ్య పాల్గొన్నారు. అనంతరం ఎన్కేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అభిమానుల కోలాహలం నడుమ ఎంపీ రంజిత్ రెడ్డి బర్త్ డే కేక్ కట్ చేయగా పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, యూత్ అధ్యక్షుడు పూసల పరమేష్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటీసీలు, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News