ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలను, తెలంగాణ పోలీసులను, డిజిపి రవి గుప్తను అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి.
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటి మీట్ లో తెలంగాణ పోలీస్ ఓవరాల్ చాంపియన్ షిప్ (చార్మినార్ ట్రోఫి) ను సాధించిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రవి గుప్త తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ చార్మినార్ ట్రోఫీని కైవసం చేసిందని డిజిపి తెలిపారు .జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ ప్రతిభను కనబరిచి ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లో ఓవరాల్ విన్నర్స్ ట్రోఫీతో పాటు ప్రొఫెషనల్ వీడియోగ్రఫీలో ఓవరాల్ రన్నర్స్ ట్రోఫీని గెలుచుకున్నారని డిజిపి తెలియజేశారు.
విజేతలకు, తెలంగాణ పోలీసు శాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారని డిజిపి అన్నారు.
బంగారుపథకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి , డి.విజయ్ కుమార్, వి. కిరణ్ కుమార్, పి.అనంతరెడ్డి, ఎం. దేవేందర్ ప్రసాద్ లు ఉన్నారని పేర్కొన్నారు. పి పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కే శ్రీనివాస్, షేక్ ఖాదర్ షరీఫ్ , సి. హెచ్ .సంతోష్, కే సతీష్ లు వెండి పథకాలను గెలుచుకున్నారని డిజిపి వివరించారు.