Friday, November 22, 2024
HomeతెలంగాణRevanth on Police recruitment: జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చ

Revanth on Police recruitment: జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చ

పోలీస్ నియామకాలపై జూబ్లీహిల్స్ నివాసంలో హైపవర్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. పోలీస్ నియామకాల్లో జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చ. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రజినీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, TSLPRB చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్సీ వెంకట్.

- Advertisement -

త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా, సూచనలు కోరిన సీఎం. గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు, కొత్త పోస్టుల నోటిఫికేషన్ పై ముందుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు పలు సూచనలు చేసిన అధికారులు. మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసిన గత ప్రభుత్వం. అక్టోబర్ 4, 2023కు 15,750 పోస్టులకు పూర్తయిన సెలెక్షన్ ప్రాసెస్.

కోర్టు కేసుతో పెండింగ్ లో ఉన్న నియామకాలు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల తీర్పునిచ్చిన హైకోర్టు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డ అడ్వకేట్ జనరల్, అధికారులు. కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని సీఎంకు సూచించిన అధికారులు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకుందామన్న సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News